వినాయక చవితి వేడుకల్లో బంగ్లా క్రికెటర్.. ఫోటోలు వైరల్!

-

హిందూ దేవతలు, దేవుళ్లు ప్రపంచ వ్యాప్తంగా పూజలు అందుకుంటున్నారు. విదేశీయులు, ఇతర మతస్తులు కూడా హిందూ సంప్రదాయాలు, సంస్కృతిని ఈ మధ్యకాలంలో ఫాలో అవుతున్నారు. విదేశాల్లో ఏకంగా విదేశీ పండితులు కూడా తయారవుతున్నారు. శాస్త్రాలు నేర్చుకుని పురోహితం చేస్తున్నారు. బాలీవుడ్‌లోనూ షారుక్, సల్మాన్ ఖాన్ లాంటి నటులు వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా బంగ్లా క్రికెటర్ హిందూ పండుగ అయిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు.

తన కుటుంబ సభ్యులతో కలిసి బంగ్లా క్రికెటర్ లిటన్ దాస్ వినాయతి చవితి సందర్భంగా గణపతికి పూజలు చేశారు.అందుకు సంబంధించిన ఫోటోలను అతను సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘గణపతి బప్పమోరియా’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news