ఇల్లు కొనేటప్పుడు చాలా మందిలో డౌట్ ఉంటుంది. అయితే ఇల్లు కొనేటప్పుడు భార్య పేరు మీద ఇల్లు కొన్నట్లయితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. చాలామందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. ఈరోజుల్లో ఇంటిని కొనుగోలు చేయడం చాలా ఖరీదుతో కూడుకున్నది. ఇంటితో పాటుగా ఇల్లు రిజిస్టర్ చేయించడం, స్టాంప్ డ్యూటీ కట్టడం, ప్రాపర్టీ టాక్స్, అదనపు ఖర్చులు ఇలా చాలా ఉంటాయి. ఈ ఖర్చుల్ని తగ్గించుకోవాలంటే ఇంటిని భార్య పేరు మీద కొనాలి అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ఎందుకంటే భారత ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో భాగమవ్వాలని, సమాజంలో చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మహిళలకు ప్రభుత్వం చాలా రకాల రాయితీలను కూడా అందిస్తుంది. ఇల్లు కొనే విషయంలో కూడా మహిళలకు కొన్ని రూల్స్, ప్రయోజనాలు ఉంటాయి. ఇంటి పై పన్ను కట్టేటప్పుడు మహిళలకు రాయితీలు లభిస్తాయి. కొత్త ఇల్లు కొనాలంటే దాన్ని భార్య పేరు మీద కొనుగోలు చేసేటట్టు చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
మహిళలకి లోన్ ఇవ్వడంలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పురుషులతో పోలిస్తే మహిళలకు అధిక ప్రయోజనాలు ఉన్నాయి. లోన్ తీసుకుని ఇల్లు కొనాలంటే భార్య పేరు మీద కొనడం చాలా మంచిది. బ్యాంకులు, హౌసింగ్, ఫైనాన్స్ కంపెనీలు మహిళలకి పురుషుల కంటే తక్కువ వడ్డీ రేటు తో లోన్స్ ఇస్తాయి. ఇల్లు కొనడానికి చాలా డాక్యుమెంట్లు కావాలి. యజమాని పేరు మీద రిజిస్టర్ చేయాలి. హౌస్ రిజిస్టర్ చేయాలంటే స్టాంప్ డ్యూటీ చెల్లించాలి.
చాలా రాష్ట్రాల్లో మహిళలకు పురుషులు కంటే తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది రెండు నుంచి మూడు శాతం వరకు తక్కువ స్టాంపు డ్యూటీ ఉంటుంది. మహిళలకు ఇలా అదా చేసుకోవడానికి అవుతుంది. అలాగే మహిళలకు ఎక్స్ట్రా టాక్స్ డిటెక్షన్ లభిస్తాయి ఇల్లు కొనడానికి తీసుకున్న లోన్ మీద ఏటా చెల్లించే వడ్డీ పై లక్షన్నర వరకు టాక్స్ డిడక్షన్ పొందవచ్చు. సెక్షన్ 80 సి కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి