వరల్డ్ కప్ వార్మ్ అప్ మ్యాచ్ లలో భాగంగా శ్రీలంక మరియు బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభంలో తుఫాన్ బ్యాటింగ్ తో చెలరేగినా, ఆ తర్వాత బంగ్లా వేసిన బ్రేక్ లతో స్లో డౌన్ అయింది. ఒకదశలో శ్రీలంజ 320 కుపైగా పరుగులు చేస్తుంది అని అంతా అనుకున్నారు.. కానీ బంగ్లా బౌలర్లు అద్భుతంగా పుంజుకుని శ్రీలంక ను 300 లోపు కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఓపెనర్లు నిస్సంక 68, పెరీరా 33 లు రాణించారు.. ఆ తర్వాత చాలా దారుణంగా వెనుకబడిన శ్రీలంక ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను ధనుంజయ డిసిల్వా (55) తీసుకున్నాడు. చివరికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
బంగ్లా బౌలర్లలో మహేది హాసన్ ఒక్కడే మూడు వికెట్లు తీసి శ్రీలంకను దారుణంగా దెబ్బ తీశాడు. మరి శ్రీలంక నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇండియా లాగే శ్రీలంకకు కూడా షాక్ ఇస్తుందా చూడాలి.