2024లో జమిలి ఎన్నికలు లేనట్టే : లా కమిషన్ 

-

జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక సూచనలు చేసింది. జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు అని లా కమిషన్ వెల్లడించింది. ముఖ్యంగా రెండు రోజుల కిందట సమావేశమైన లా కమిషన్ పూర్తి స్థాయి విచారణ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కూడా ఓ కమిటీ వేశారు. 

రామ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక చాలా కీలకం కాబోతుంది. రానున్న ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది తరువాత అంశమని స్పష్టమవుతోంది. రాజ్యాంగ సవరణ లేకుండా జమిలి సాధ్యం కాదని లా కమిషన్ పేర్కొంది. 2029లో జమిలి ఎన్నికల కోసం లా కమిషన్ కసరత్తు చేస్తోంది. 1951 ప్రజాప్రాతినిత్య చట్టంలోని నిబంధనలు సవరించాలని లాకమిషన్ సిఫారసు చేసింది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ లో ఎన్నికలు జరుగబోతున్నాయి. గత కొద్ది రోజుల కిందట జమిలీ ఎన్నికలపై పెద్ద ఎత్తన చర్చలు జరిగాయి. ఫైనల్ గా ఇప్పుటికిప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యం కాదు.. రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్ మార్చిన తరువాతనే జమిలి ఎన్నికలు సాధ్యమవుతుందని తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news