అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే.. అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. లడ్డూ వివాదం పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందని.. సీబీఐ విచారణ కోరుతూ హోంశాఖకు లేఖ రాయనట్టు తెలిపారు. లడ్డూ వివాదం పై ప్రధాని, హోంమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా వాడుకోవడానికే ఇప్పుడు బయట పెట్టారా..? ప్రశ్నించారు. సీబీఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవ్వరూ చేశారనే విషయం బయటికీ రాదు. ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే.. వాళ్ల మీద యాక్షన్ తీసుకోవాలి. లేకుంటే మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.