పింక్ బాల్ ని తడిపి, కంకర రాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తున్న బంగ్లాదేశ్… ఎందుకు…?

-

భారత్ మీద రెండో టెస్ట్ లో విజయం సాధించడానికి పింక్ బాల్ తో కంకర రాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తుంది బంగ్లాదేశ్ జట్టు. టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ లో బంగ్లాదేశ్ జట్టుని ఏ దశలో కోలుకోనివ్వకుండా భారత్ ఆది నుంచి ఎదురు దాడి చేసింది. స్పిన్, పేస్ విభాగం రెండూ కూడా బంగ్లాదేశ్ ని కట్టడి చేశాయి. పేస్ బౌలింగ్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక బంగ్లాదేశ్ జట్టు కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడింది అనేది వాస్తవం. దీనితో రెండో టెస్ట్ లో టీం ఇండియాకు,

గట్టి పోటీ ఇవ్వడానికి గాను బంగ్లాదేశ్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా పేస్ బౌలింగ్ ని ఎదుర్కోవడానికి గానూ… రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఉంది కాబట్టి పింక్ బాల్ ని తడిపి బ్యాటింగ్ చేస్తున్నారు ఆటగాళ్లు. బంతి అనూహ్యంగా స్వింగ్ అయ్యే అవకాశం ఉన్న ఈడెన్ గార్డెన్స్ లో మంచు కురిస్తే బ్యాటింగ్ చేయడం కష్టం కాబట్టి ఈ విధంగా చేస్తున్నామని ఆ జట్టు ఆటగాళ్లు అంటున్నారు. ఇక బౌలర్లు కూడా తేమ ఉన్న బంతితో బంతులు విసురుతూ ప్రాక్టీస్ చేశారు. తద్వారా పింక్ బాల్ మీద గ్రిప్ పెంచుకుంటున్నామని అంటున్నారు.

ఇక స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడానికి బంగ్లా టాప్ ఆర్డర్ అయితే… తడి బంతితో కంకర రాళ్ళ మీద ప్రాక్టీస్ చేయడం విశేషం. ముఖ్యంగా అశ్విన్ స్పిన్ ని ఎదుర్కోవడానికి ఆ జట్టు ఎక్కువగానే కష్టపడుతుంది. ఎక్కువ సేపు క్రీజ్ లో ఉంటే మెరుగైన స్కోర్ సాధించవచ్చని భావిస్తున్న బంగ్లా… ఎక్కువ సమయం ప్రాక్టీస్ లో గడిపేస్తుంది. కంకర రాళ్ళ మీద బంతులు విసురుతూ చేస్తున్న ప్రాక్టీస్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది. అటు బౌలర్లు కూడా మంచు పడే అవకాశం ఉండటంతో తడి బంతిని ఏ విధంగా తిప్పాలి అనే దాని మీద శ్రమిస్తున్నారు. ఇందుకోసం జట్టు కోచ్ డానియల్ వెటోరి సలహాలను తీసుకుంటున్నారు. కాగా శుక్రవారం నుంచి రెండు జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్ట్ మొదలు కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version