బ్యాంకులకి 2 రోజుల సెలవులు అంటే చాలు జనాలు పరగుల మీద పరుగులు తీస్తుంటారు. ATM ల ముందు పడిగాపులు కాస్తారు. బ్యాంకులు అన్నీ కిటకిటలాడుతుంటాయి. మరి కేవలం ఒక్క అక్టోబర్ నెలలో బ్యాంకులకి 11 రోజుల సెలవులు ఉంటే ఇంకేంత హడావుడిగా ఉంటుందో ఊహించుకోండి. చేతిలో డబ్బు పడేంత వరకూ కంటి మీద కునుకు ఉండదు. ఒక వేళ బ్యాంకుల ద్వారా డబ్బు తీసుకోకపోతే బయట కమీషన్ చెల్లించి డబ్బు తీసుకునే పద్దతిలో జేబులకి చిల్లు పడుతోంది. కాబట్టి ప్రజలు బీ అలెర్ట్.
ఇక అక్టోబర్ లో బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవు. ఏ రోజుల్లో ఎందుకు పని చేయవు అనే వివరాలోకి వెళ్తే. అక్టోబర్ -2 గాంధీ జయంతి. ఈ కారణంగా బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసే ఉంటాయి. అందుకే ముందుగానే డబ్బులు తీసుకునే విషయంలో ప్లాన్ చేసుకోండి. ఇక మరో మూడు రోజులు అయితే 6 వ తారీకు ఆదివారం అయ్యింది. గాంధీ జయంతి అయిన రెండో రోజునే డబ్బులు ATM ల నుంచీ తీసేస్తారు ఎందుకంటె దసరా పండుగ ఎఫెక్ట్ కాబట్టి ఆదివారం ముందుగానే డబ్బులు తీసుకోండి.
అక్టోబర్ 7 న మహర్నవమి , అక్టోబర్ 8 న దసరా ఈ రెండు రోజులు బ్యాంకులు బంద్. ఇక 12 వ తీదీ రెండో శనివారం అయ్యింది. 13 ఆదివారం అందుకు వాల్మీకి జయంతి కూడా. అక్టోబర్ 20 ఆదివారం కాగా 26 తీదీ నాలోగో శనివారం అయ్యింది. 27 దీపావళి పండుగ 28 గోవర్ధన పూజ ఈ పండుగకి కొన్ని బ్యాంకులు తెరిచే ఉంటాయి. 29 యమ విదియ ఈ పండుగ రోజు కూడా కొన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయి. ముఖ్యంగా 2 వ తీదీ మొదలు 13 వరకూ డబ్బు లావాదేవీలు ఉంటే తప్పకుండా త్వరపడండి.