తెలంగాల లోని మహిళలకి గుడ్ న్యూస్. ప్రభుత్వం వారికి ఈ తీపికబురు ని చెప్పింది. రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) అకౌంట్‌లలోకి డబ్బులు పడనున్నాయి. సోమవారం రూ.217 కోట్లు జమ చేసిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. పూర్తి వివరాలని చూస్తే.. గతం లో బ్యాంకులు అధికంగా వసూలు చేసిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల అకౌంట్‌లో వేశారని అన్నారు.
మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎక్కువ రుణాలిస్తూనే బ్యాంకర్లు ఇష్టారీతిన వడ్డీ వసూలు చేసినట్టు వెల్లడించారు. 2022 డిసెంబరు 23న జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఈ అంశం పై చర్చించారు. ఒక్కో బ్రాంచి లో ఒక్కోలా వడ్డీ వసూలు చేసారని… ఇలా చేయడం మంచిది కాదన్నారు హరీష్ రావు. కొన్ని బ్యాంకులు ఈ నిబంధనను పట్టించుకోకుండా ఎక్కువ వడ్డీని వసూలు చేసారు.
రూ.3 లక్షల వరకు లోన్ పైన గరిష్ఠంగా 7శాతం, రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణంపై 10 శాతం వసూలు చెయ్యాలని చెప్పారు. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా మహిళలు మోసపోయారని అన్నారు. ఏ బ్యాంకులోనైనా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ వసూలు చేస్తుంటే ఆ డబ్బులని వాళ్లకి చెల్లించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,03,535 సంఘాల నుంచి రూ.217.61 కోట్ల మేర అధికంగా వడ్డీని వసూలు చేసారని చెప్పారు. రెండు లక్షల సంఘాలకు లబ్ధి చేకూరింది.