రాష్ట్రంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు.
పశుపోషణ, మత్స్య పరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరిచేందుకు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మంత్రి తుమ్మల సూచించారు.