గుడ్ న్యూస్.. సొంతింటి కల సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం.. పూర్తి వివరాలు ఇవే..!

-

గృహలక్ష్మి పథకం వివరాలు: గుడ్ న్యూస్. సొంత స్థలం ఉన్న పేదలకు ఇది పెద్ద శుభవార్తే. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక పోతుంటే రూ.3 లక్షలు ఆర్థిక సాయం పొంది మీ సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ స్కీమ్ తో చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం ఈ స్కీము అందిస్తోంది. అందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ఈ నెల పదవ తేదీ దాకే సమయం ఉంది. వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థికసాయం ఇస్తోంది. ఆగస్టు పదిలోగా దరఖాస్తు చేసుకోండి.

నియోజకవర్గానికి 3000 చొప్పున లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. స్టేట్ రిజర్వ్ కోటా లో చూస్తే 43 వేలు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ప్రయోజనం కల్పించనున్నారు. ఈ స్కీమ్ కి గృహిణులు, వితంతువులు మా త్రమే అర్హులు. అయితే కచ్చితంగా స్థలం ఉండాలి. మహిళల పేరు మీదే గృహలక్ష్మి స్కీమ్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇళ్లు పూర్తి ఇలా మూడు దశల్లో ఇస్తారట. ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వు కింద లబ్ది పొందినట్టయితే వాళ్ళు అర్హులు కారు. ఎస్సిలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బిసి- మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా ఎంపిక చేయనున్నారు. ఈ స్కీమ్ ప్రాసెస్ పూర్తి అయ్యాక ఈ నెల 25వ తేదీన ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోంది.

గృహలక్ష్మి స్కీమ్ కోసం కావాల్సిన పత్రాలు:

ఈ పత్రాలని కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే గృహలక్ష్మి స్కీమ్ తాలూక బెనిఫిట్స్ ని పొందడానికి అవుతుంది.

HYD, RR, MM, VKB జిల్లాలో గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులు ని ఆఫ్లైన్ పద్ధతిలో మండల మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు.
మహిళ పేరు మీద ఉన్న స్థలం పేపర్లు కచ్చితంగా తీసుకువెళ్లాలి.
అలానే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలి.
రేషన్ కార్డు
బ్యాంకు ఖాతా
ఆధార్ కార్డు
రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
ఇంటి పన్ను రసీదు
కరెంట్ బిల్లు రసీదు వంటి పత్రాలు ఈ స్కీం బెనిఫిట్స్ ని పొందడానికి అవసరమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news