స్విగ్గీ మెంబర్షిప్‌తో హెడీఎఫ్‌సీలో కొత్త క్రెడిట్‌ కార్డు.. ఆఫర్స్‌ అదుర్స్‌..!!

-

ప్రైవేట్‌ కంపెనీలు క్రెడిట్‌ కార్డును త్వరగా ఇస్తాయి. అది కూడా మీ సిబిల్‌ స్కోర్‌ను బట్టి లక్షల్లో ఉంటుంది. ది పడితే అది కాదు.. క్రెడిట్‌ కార్డును తీసుకునేప్పుడు మన అవసరాలకు తగ్గట్టుగా, ఆఫర్లు ఎందులో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుని తీసుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ కొత్త క్రెడిట్ కార్డు తీసుకువచ్చింది. స్విగ్గీ భాగస్వామ్యంతో ఈ కార్డును ఆవిష్కరించింది. ఈ కార్డు ద్వారా అదిరే ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.

ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC) తాజాగా శుభవార్త అందించింది. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దిగ్గజ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ భాగస్వామ్యంతో ఈ కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఇది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు. స్విగ్గీ నుంచి వస్తున్న తొలి క్రెడిట్ కార్డు కూడా ఇదే. మాస్టర్ కార్డు పేమెంట్ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పని చేయనుంది. ఈ కార్డు ద్వారా అదిరే బెనిఫిట్స్ పొందొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డు ద్వారా అదిరే రివార్డు పాయింట్లు వస్తాయి. స్విగ్గీ కొనుగోలుపై మాత్రమే కాకుండా ఇతర ఆన్‌లైన్ పేమెంట్లపై కూడా మంచి డీల్స్ పొందొచ్చు. క్రెడిట్ కార్డు యూజర్లు స్విగ్తీ ద్వారా ఆర్డర్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ , మింత్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మా ఈజీ, నెట్ మెడ్స్, బుక్ మై షో ఇలా చాలా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ క్రెడిట్ కార్డుతో డీల్స్ సొంతం చేసుకోవచ్చు. 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. నైకా, హెచ్అండ్ఎం, జరా, అడిదస్ వంటి బ్రాండెడ్ వెబ్‌సైట్ల కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.

ఇవే కాకుండా ఇతరత్రా వాటిపై ఖర్చు చేస్తే 1 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ కొత్త క్రెడిట్ కార్డు వాడే వారికి క్యాష్ బ్యాక్ అనేది స్విగ్గీ మనీ రూపంలో లభిస్తుంది. దీని ద్వారా స్విగ్గీ ద్వారా సర్వీసుల కోసం పేమెంట్లు చేయొచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డుపై వెల్‌కమ్ గిఫ్ట్ కూడా ఉంది. 3 నెలల వరకు స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ ఫ్రీగా వస్తుంది. ఫుడ్, గ్రాసరీ, డైనింగ్ ఔట్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ బెనిఫిట్స్ పొందొచ్చు. స్విగ్గీ యాప్‌లో ఈ క్రెడిట్ కార్డు వచ్చే 10 రోజుల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అర్హత కలిగిన కస్టమర్లు ఈ కార్డును పొందొచ్చు. కాగా ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు రూ. 500గా ఉంది. యాన్యువల్‌ ఫీజ్‌ రూ.500 ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news