గోర్లు కొరికే అల‌వాటు ఎంత ప్ర‌మాద‌మో తెలుసా.. ?

-

కొంత మంది గోళ్ళని ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. గోళ్ళని నెయిల్ కట్టర్ తో తొలగించకుండా పదే పదే గోళ్ళని నోటితో కొరుకుతూ ఉంటారు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు గోళ్ళు కొరుకుతూ ఉంటారు లేదంటే ఏమీ తోచక గోళ్ళని కొరుకుతూ ఉంటారు, కొందరు భయం వేసినప్పుడు టెన్షన్లో కూడా గోళ్ళని కొరుకుతూ ఉంటారు. ఒక థియరీ ప్రకారం చూసుకున్నట్లయితే ఎమోషన్స్ ని బట్టి గోళ్ళని కొరుకుతూ ఉంటారట.

గోర్లు
గోర్లు

అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఈ విషయంపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది గోళ్ళని కొరికితే పళ్ళు పాడవుతాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు కొంతమంది పంటి ఇబ్బందులతో బాధపడి బ్రెసెస్ ని పెట్టుకుంటారు. బ్రేసెస్ ఉన్న వాళ్ళు గోళ్లు కొరికితే పంటిని కోల్పోయే అంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుంది. గోళ్లు కొరకడం వలన తలనొప్పి, ఫేషియల్ పెయిన్, పళ్ళు ఊడిపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.

పళ్ళ సెన్సిటివిటీ కూడా ఎదురుకోవాలి. ఇలా పంటి డామేజ్ అవుతుంది. అలానే గోళ్ళని కొరకడం వలన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాలని తీసుకువస్తుంది. బ్యాక్టీరియా కారణంగా గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది గోళ్ళని కొరుకుతే గోళ్లు ఎరుపు రంగులోకి మారడం, వాపు కలగడం, చీము పట్టడం వంటివి కూడా జరుగుతాయి. ఈ అలవాటు నుండి బయట పడాలంటే ఎప్పటికప్పుడు గోళ్ళని చిన్నగా కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు గోళ్ళని కొరకడం మానేస్తారు. లేదంటే మీరు గోళ్ళని కొరికేటప్పుడు ఒక స్ట్రెస్ బాల్ ని కానీ లేదంటే టెన్షన్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ ట్రై చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news