ఎస్పీఐ రూపే క్రెడిట్‌ కార్డును యూపీఐకు లింక్‌ చేయడం ఎలా..?

-

క్రెడిట్‌ కార్డులో రూపే కార్డు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. దీనికి యూపీఐ ఆప్షన్‌ ఇవ్వడంతో జనాలు ఈ కార్డు కోసం ఎగబడుతున్నారు. ఇంతకు ముందు క్రెడిట్‌ కార్డును పెద్ద పెద్ద షాపుల్లోనే ఇవ్వగలం. మరీ పది వందకు యూపీఐతో డెబిట్‌ కార్డు నుంచి పంపినట్లు పంపే వీలు క్రెడిట్‌ కార్డులకు లేకుండా పోయింది. ఇప్పుడు రూపే క్రెడిట్‌ కార్డుతో ఆ సమస్య తీరింది. అయితే ఇన్ని రోజులు.. రూపే కార్డుల్లో ఎస్బీఐను ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎంలో లింక్ చేసే వీలు లేదు. కార్డు ఉంది కానీ దీన్ని ఎలా యూపీఐకి లింక్‌ చేయాలని జనాలు తెగ ఆలోచిస్తున్నారు. SBI క్రెడిట్ కార్డులను UPIతో లింక్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో చేతులు కలిపింది.

ఇప్పుడు రూపేలో జారీ చేసిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ ట్రాన్సాక్షన్‌లను కస్టమర్లు యూపీఐ ద్వారా చేయవచ్చు. 2023 ఆగస్టు 10 నుంచి ‘ఎస్‌బీఐ కార్డ్’ ఈ అవకాశం కల్పించింది. లేటెస్ట్‌ ఫీచర్‌ కోసం కస్టమర్లు క్రెడిట్ కార్డును థర్డ్-పార్టీ UPI యాప్‌లతో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత UPI ప్లాట్‌ఫామ్‌లో క్రెడిట్ కార్డ్‌లను ఈజీగా వినియోగించవచ్చు, ఎలాంటి అంతరాయాలు లేకుండా పేమెంట్స్‌ చేయవచ్చు.

ఎస్‌బీఐ కార్డ్‌ లేటెస్ట్‌ ఫీచర్‌ను పొందడానికి, కార్డ్ హోల్డర్లు యాక్టివ్ ప్రైమరీ కార్డ్‌లను UPIతో లింక్ చేయాలి. ఈ ప్రాసెస్‌ వినియోగదారులకు ఉచితం. SBI కార్డ్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్, UPIతో లింక్ అయి ఉండాలి.

SBI కార్డ్ జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో ఎలా లింక్‌ చేయాలంటే..

  • ముందు మీకు నచ్చిన UPI థర్డ్ పార్టీ యాప్‌ను Play/App స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • UPI యాప్‌లో మొబైల్ నంబర్‌ను వెరిఫై చేసి, రిజిస్ట్రేషన్‌ కంప్లీట్‌ చేయండి.
  • రిజిస్ట్రేషన్‌ సక్సెస్‌ఫుల్ అయ్యాక, ‘యాడ్‌ క్రెడిట్ కార్డ్/లింక్ క్రెడిట్ కార్డ్‌’ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోండి.
  • క్రెడిట్ కార్డ్ కంపెనీల లిస్ట్‌ నుంచి ‘ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్’ ఎంచుకోండి.
  • ఇక్కడ లింక్ చేసే ప్రాసెస్‌ కోసం మీ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డును సెలక్ట్‌ చేయండి.
  • తర్వాత క్రెడిట్ కార్డ్ చివరి 6 అంకెలు, ఎక్స్‌పైరీ డేట్‌ ఎంటర్ చేసి, 6 అంకెల UPI పిన్‌ సెట్ చేయండి.
  • ఇంతటితో ప్రాసెస్ పూర్తవుతుంది.

పాయింట్ ఆఫ్ సేల్ (PoS) పేమెంట్స్‌ ఎలా చేయాలి?

  • యూపీఐ ఎనేబుల్డ్‌ థర్డ్-పార్టీ యాప్‌లో మర్చంట్ UPI QR కోడ్‌ను స్కాన్ చేయండి.
  • పేమెంట్‌ చేయాల్సిన మనీ ఎంటర్‌ చేయండి.
  • డ్రాప్‌డౌన్ నుంచి UPIతో లింక్ చేసిన SBI రూపే క్రెడిట్ కార్డును ఎంచుకోండి.
  • ట్రాన్సాక్షన్‌ అథెంటికేట్‌ చేయడానికి 6-అంకెల UPI పిన్‌ ఎంటర్‌ చేయండి.
  • ఇ-కామర్స్ వ్యాపారులకు పేమెంట్స్‌ ఎలా చేయాలి?
  • మర్చంట్ వెబ్‌సైట్/యాప్‌లో పేమెంట్ మోడ్‌గా క్రెడిట్ కార్డ్‌తో లింక్ అయిన UPI-ఎనేబుల్డ్‌ యాప్‌ను సెలక్ట్‌ చేయండి.
  • UPI-ఎనేబుల్డ్‌ యాప్‌కి లాగిన్ అవ్వండి. అందుబాటులో ఉన్న అకౌంట్స్‌ లిస్ట్‌ నుంచి రిజిస్టర్డ్ SBI రూపే క్రెడిట్ కార్డును ఎంచుకోండి.
  • 6-అంకెల UPI పిన్‌ని ఉపయోగించి పేమెంట్‌ని అథెంటికేట్‌ చేయండి.
  • పేమెంట్‌ కన్ఫర్మేషన్‌ డిస్‌ప్లే అవుతుంది.
  • పేమెంట్‌ తర్వాత, మర్చంట్‌ పేజీకి రీడైరక్ట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version