పదే పదే సిబిల్‌ స్కోర్‌ చేస్తే స్కోర్‌ తగ్గుతుందా..?

-

క్రెడిట్‌ కార్డు తీసుకోవాలన్నా, లోన్స్‌ తీసుకోవాలన్నా.. సిబిల్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.. పిలిచి మరీ లోన్స్‌, క్రెడిట్‌ కార్డులు ఇస్తారు. అయితే మీరు చూసే ఉంటారు చెక్‌ క్రెడిట్‌ స్కోర్‌ ఫ్రీని పేటిమ్‌, ఫోన్‌పే లాంటి యాప్స్‌లో మనకు కనిపిస్తుంది. అది చెక్‌ చేసుకోమనింది కదా అని ఊకే పోయి చెక్‌ చేసుకోకూడదు. మీరు సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేస్తే దాని ప్రభావం మీ సిబిల్‌పై కచ్చితంగా పడుతుంది. స్కోర్‌ తగ్గుతుంది. క్రెడిట్ స్కోరు చెక్ చేసిన ప్రతీసారి కొంత వరకు స్కోరు తగ్గొచ్చు. ఎలాంటి సందర్భంలో క్రెడిట్ స్కోరు తగ్గుతుందో తెలుసుకుందాం.

cibil Score

క్రెడిట్ స్కోరు చెకింగ్

బ్యాంకులు వ్యక్తిగత రుణాలను ఎటువంటి హామి లేకుండా జారీ చేస్తాయి. కాబట్టి, దరఖాస్తుదారుని రుణ చరిత్ర పరిశీలించడానికి క్రెడిట్ స్కోరును చెక్ చేస్తాయి. వ్యక్తుల క్రెడిట్ స్కోరు 750, ఇంతకన్నా ఎక్కువ ఉంటే.. వారి . వీరికి రుణం త్వరగా మంజూరు చేయడమే కాకుండా, వడ్డీ రేటు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది.

సాఫ్ట్ ఎంక్వైరీ

క్రెడిట్ స్కోరు పరిశీలన సాఫ్ట్ ఎంక్వైరీ, హార్డ్ ఎంక్వైరీ అనే రెండు విధాలుగా జరుగుతుంది. మీరు సొంతంగా చెక్ చేసుకోవడం లేదా బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు, ఇతర రుణ సంస్థలు ముందస్తు రుణాల కోసం చెక్ చేయడాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. ఇలాంటి చెకింగ్లు క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం చూపవు.

హార్డ్ ఎంక్వైరీ

మీరు రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకు క్రెడిట్ నివేదికల కోసం బ్యూరోను అభ్యర్థిస్తే దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఒక బ్యాంకులో లోన్‌ కోసం అప్లై చేసి అది ఏదో ఒక కారణం చేత రిజక్ట్‌ అయితే.. మళ్లీ మీరు వేరే బ్యాంకులో లోన్‌ కోసం అప్లై చేస్తే అక్కడ ముందే ఒక బ్యాంకు సిబిల్‌ స్కోర్‌ను చెక్‌ చేసింది కదా.. ఆ ప్రభావం ఇప్పుడు మీరు అప్లై చేసిన బ్యాంకు లోన్‌ పై పడుతుంది. వాళ్లకు తెలిసిపోతుంది. ఈ రకమైన ఎంక్వైరీలతో క్రెడిట్ స్కోరు కొంత వరకు తగ్గుతుంది. ఇటువంటివి విచారణలు క్రెడిట్ బ్యూరో వద్దకు పదే పదే వస్తుంటే ఒక్కో ఎంక్వైరీపై 5 పాయింట్ల వరకు స్కోరు తగ్గుతుంది.

క్రెడిట్ స్కోరు తగ్గకూడదంటే..

రుణం అవసరమైనప్పుడు అనేక బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేయకూడదు. ముందుగా మీ క్రెడిట్ స్కోరుని తెలుసుకోవాలి. మంచి స్కోరు ఉంటే.. వివిధ బ్యాంకుల్లో వడ్డీ ఎంత, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీల గురించి విచారణ చేయాలి. అప్పుడు మీకు అనుకూలమైన ఒక బ్యాంకును ఎంచుకుని రుణానికి దరఖాస్తు చేయాలి.

హార్డ్ ఎంక్వైరీలు మీ క్రెడిట్ నివేదికలో రెండు సంవత్సరాల పాటు కనిపించే అవకాశం ఉంది. అయితే రుణాలు, క్రెడిట్ కార్డుల బిల్లులు సమయానికి చెల్లిస్తే త్వరలోనే క్రెడిట్ స్కోరు తిరిగి పుంజుకుంటుంది.

ఒకేసారి వివిధ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తే క్రెడిట్ స్కోరులో గణనీయంగా తగ్గుదల కనిపించొచ్చు. దరఖాస్తు చేసే ముందు మీ అర్హత, అవసరాలను, వర్తించే రుసుములు దృష్టిలో ఉంచుకుని ఆ తర్వాతే ఒక బ్యాంకు వద్ద కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version