లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఫోన్ లో నుండే ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఏదైనా వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఇలా ఈజీగా లోన్ పొందవచ్చు. పైగా దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మరి ఇక ఈ లోన్ ని ఎలా పొందొచ్చు..?, ఎవరికి ఈ లోన్ వస్తుంది మొదలైన వివరాలని చూద్దాం. డిజిటల్ పేమెంట్స్ సర్వీసుల సంస్థ పేటీఎం తాజాగా చిన్న, రిటైల్ వ్యాపారుల కోసం లోన్ సదుపాయాన్ని కల్పించింది.

money

దీనితో ఏ తనఖా లేకుండా రుణాలు ఈజీగా పొందొచ్చు. పైగా తక్కువ వడ్డీకే లోన్ ని తీసుకో వచ్చు. కస్టమర్స్ కి లోన్ ని అందించడానికి పేటీఎం పలు బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లోన్ ఎవరు అర్హులు అనేది చూస్తే.. మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద అర్హత కలిగిన వారు లోన్ కి అర్హులు. వారు ఈ రుణాలు పొందొచ్చు.

ఈ లోన్ కోసం పేటీఎం బిజినెస్ యాప్ ద్వారా అప్లై చేసుకోచ్చు. మొత్తం డిజిటల్ రూపంలోనే లోన్ పొందొచ్చు. ఇలా రూ.5 లక్షల వరకు రుణం వస్తుంది. పైగా తక్కువ వడ్డీకే. అదనంగా ఎలాంటి డాక్యుమెంట్లు కూడా ఇవ్వక్కర్లేదు. ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఏమి వుండవు. మీరు కనుక లోన్ కోసం అప్లై చెయ్యాలంటే ముందుగా పేటీఎం బిజినెస్ యాప్‌ను వాడాలి.

ఈ యాప్ ని ఓపెన్ చేసాక బిజినెస్ లోన్ ఐకాన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. నచ్చినంత లోన్ ని తీసుకోచ్చు. రూ.5 లక్షల వరకు లోన్ వస్తుంది. డెయిలీ ఇన్‌స్టాల్‌మెంట్, టెన్యూర్ వంటి తదిరత వివరాలు కూడా కనిపిస్తాయి. ఆ తరవాత గెట్ స్టార్టెడ్‌పై క్లిక్ చేయాలి.

కేవైసీ వివరాల కోసం అంగీకారం తెలపాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. వివరాలని ఎంటర్ చేసాక వెరిఫై చేస్తారు. రుణ అర్హత తెలుస్తుంది. అర్హత ఉన్న వారు లోన్ అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అకౌంట్ లో డబ్బులు పడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version