జీవితంలో ఆర్థిక సమస్యలు రావడం సహజం. అటువంటి సమయంలో అందరూ లోన్ పై ఆధారపడుతూ ఉంటారు. అయితే లోన్ తీసుకోవడం కోసం ఎన్నో పత్రాలను సమర్పించి ప్రాథమిక అర్హత ప్రమాణాలను తీర్చడం వంటివి చేయాలి. బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక వ్యవస్థలు తక్కువ పత్రాలతో మరియు తక్కువ సమయంలో రుణాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విధంగా ఇన్స్టంట్ లోన్ ను తీసుకురావడం జరిగింది. ఇన్స్టంట్ గా పర్సనల్ లోన్ పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్‌కు సంబంధించిన వివరాలను అందించి ఐదు లక్షల వరకు లోన్ ను ఎంతో సులభంగా పొందవచ్చు.
ఈ లోన్ లో భాగంగా ఆదాయం, క్రెడిట్ స్కోర్, గత చెల్లింపు చరిత్ర మరియు ఇతర పత్రాలకు సంబంధించిన వివరాలను బ్యాంక్ లేక ఇతర ఆర్థిక సంస్థలు తెలుసుకుంటాయి. దాని ప్రకారం అర్హతను నిర్ణయిస్తారు. ఇన్స్టాంట్ గా పర్సనల్ లోన్ ను పొందాలంటే శాలరీ స్లిప్పులు, బ్యాంక్ స్టేట్మెంట్లు రుణదాతలు అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా గత మూడు నుండి ఆరు నెలల శాలరీ స్లిప్పులను బ్యాంకుకు అందించడం వలన ఎంతో త్వరగా పర్సనల్ లోన్ పొందవచ్చు.
అంతేకాకుండా పర్సనల్ లోన్ కోసం కొన్ని బ్యాంకులు పాన్ మరియు ఆధారికా ప్రమాణిక ఐడీలను తీసుకుంటున్నారు. జీతం పొందే రుణ దరఖాస్తుదారులు ఉద్యోగి మరియు అపాయింట్మెంట్ లెటర్‌ను కచ్చితంగా సమర్పించాలి. ఇటువంటి బ్యాంకింగ్ ప్రక్రియలు లోన్ తీసుకునేటువంటి బ్యాంక్ పై ఆధారపడి ఉంటాయి. కనుక బ్యాంక్ ప్రకారం అడిగిన వివరాలను సమర్పించాలి. ఇన్స్టంట్ పర్సనల్ లోన్ లో డిజిటల్ కేవైసీను అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా పేపర్‌లెస్ ఆన్‌బోర్డింగ్ ను ధ్రువీకరణ చేసిన వెంటనే లోన్ ను పొందవచ్చు. కనుక అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి లోన్లను ఉపయోగించుకోవచ్చు.