పాశమైలారం బాధితులకు తెలంగాణ సర్కార్ తక్షణ సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున తక్షణ సాయం అందించనుంది. గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున ప్రభుత్వ సాయం అందించనుంది.

ఇది నష్టపరిహారం కాదని అధికారులకు తెలిపిన రేవంత్ రెడ్డి.. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కాగా సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో 42కి మృతుల సంఖ్య చేరింది. ఇందులో మరో 42 మంది గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇంకా 27 మంది ఆచూకీ లభించలేదు. ఇక వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్.