రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య భారీ గా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. తాజాగా 75 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం కాలంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీంతో భారీగా బంగారాన్ని కొనుగోలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.
అదే విధంగా ఈ బంగారం కొనుగోలు విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచు కునేందుకు వీలుగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంది. ప్రస్తుతం బంగారం కొనుగోలు తో ఇది కాస్త పెరిగింది.
అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 734.84 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. తాజాగా తీసుకున్న 75 టన్నులు ఈ మొత్తం లో చేరనున్నాయి. అయితే భవిష్యత్తు లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులో భాగం గానే ఆర్‌బీఐ బంగారం కొనుగోలు పై ఆసక్తి చూపుతుంది.