పొరపాటున వేరే అకౌంట్‌కు పంపిన మీ డబ్బును తిరిగి ఇలా పొందండి..!

-

ఈ మధ్య కాలం లో క్యాష్ కంటే కూడా చాలా మంది ఆన్లైన్ పేమెంట్స్ ని చేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ వ్యాలెట్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, గూగుల్ పే, ఫోన్ ఫే వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరగడం మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైనా కనుక డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో పొరపాటు కూడా జరిగే అవకాశం వుంది. దీనితో డబ్బులు మరొకరి వెళ్లే అవకాశం వుంది. అయితే మరి ఇక అలా తప్పులు జరిగితే ఏం చెయ్యాలి అనేది చూద్దాం.

 

అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్ తప్పుగా ఎంటర్ చేసినట్టయితే డబ్బు వేరే వాళ్ల అకౌంట్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో అకౌంట్ నంబర్‌తో పాటు IFSC కోడ్‌ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో కొన్ని సార్లు ఇలాంటివి సాధారణంగా జరుగుతాయి.

దీని కారణంగా ఒకరికి వెళ్లవలసి డబ్బు మరొకరి అకౌంట్‌ లోకి వెళుతుంది. అప్పుడు వెంటనే బ్యాంకును సంప్రదించాలి. బ్యాంకు మేనేజర్‌ను కలిసి కంప్లైన్ట్ చేయాలి. అయితే చాలా సార్లు ఇలా పొరపాటును వేరే వారికి వెళ్లిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు ఆ వ్యక్తి కూడా అంగీకరిస్తే డబ్బులు వచ్చేస్తాయి. కానీ కొందరు నిరాకరిస్తారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version