అదాని రూ.100 కోట్లు తీసుకోవడం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ట్రానికి సీఎస్ఆర్ ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్టు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మా అధికారి జేఏసీ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగిందని తెలిపారు.

జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగ తెలంగాణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న రూ.100 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని.. దయచేసి రూ.100 కోట్లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయకూడదని స్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. ఈ పత్రిక సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు, పక్క దేశాలల్లో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version