కీలక నిర్ణయం తీసుకున్న దేశీ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి చాల రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం తాజాగా కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేస్ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 0.10 మేర పెంచేసింది. అలానే ప్రైమ్ లెండింగ్ రేటును కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ రేటు కూడా 0.10 శాతం పెంచేసింది. ఇలా పెరగడం తో బేస్ రేటు 7.55 శాతానికి చేరింది. ఇది ఇలా ఉంటే ప్రైమ్ లెండింగ్ రేటు 12.3 శాతానికి చేరింది.

దీని కారణంగా గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడింది అని చెప్పచ్చు. బ్యాంకులు నిర్ణీత బేస్ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి లోన్ పొందాలని భావించే వారిపై ఎఫెక్ట్ పడొచ్చు. అయితే వీటి కారణంగా లోన్ తీసుకోవాలనుకునే వారికి భారం కానుంది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ లెండింగ్ రేటులో MCLR మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

రుణ రేట్ల పెంపు నిర్ణయం డిసెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చింది. బేస్ రేటు పెంపు వల్ల బ్యాంక్ కస్టమర్లపై నేరుగానే ప్రభావం ఉంటుంది. కనుక ఇక అధిక వడ్డీ భారం మోయాల్సి వస్తుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బేస్ రేటును 7.3 శాతం నుంచి 8.3 శాతం మధ్యలో ఉంచుకోవచ్చని బ్యాంకులకు వెసులుబాటు కల్పించింది. ఇప్పుడైతే ఎస్‌బీఐ బేస్ రేటును 7.55 శాతంగా కొనసాగిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version