డెబిట్ కార్డు వాడే వారికి తియ్య‌టి ముచ్చ‌ట‌

-

డెబిట్ కార్డు వాడేవారికి ఒక తీపి ముచ్చ‌ట‌. సాధార‌ణంగా అత్యవసర సమయాల్లో పైస‌లు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలంటే త‌ప్ప‌నిస‌రిగా డెబిట్ కార్డు యంత్రంలో మన అందరికి ఇంటర్నెట్ అవసరం అనే విషయం తెలుసు. ఒకవేల మన ఏరియాలో ఇంటర్నెట్ లేకపోతే ఆ టైంలో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త సాకేంతిక‌త రాబోతుంది. ఈ టెక్నాలజీ హెల్ప్‌తో మనం ఉన్నప్రాంతంలోనే డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఈ విధంగా వీసా కంపెనీ పనిచేస్తుంది.

మనకు అందించే చిప్ తో వీసా డెబిట్ కార్డు ద్వారా నెట్ లేకున్నా ప్రతి రోజు రూ. 2,000 వరకు లావాదేవీలు జరపవచ్చు. ఇప్పటికే పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ఇన్నోవిటి పార్ట్‌న‌ర్తో వీసా ఆఫ్ లైన్ చెల్లింపుల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీఓసీ) విధానంలో ఒక డెబిట్ కార్డు తయారు చేసింది. ఈ పీఓసీ కార్డును యస్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ కార్డుల ఇతర వాటి కంటే వేరుగా ఉంటాయి. ఇవి నెట్ వర్క్ క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ కొత్త వీసా చిప్ డెబిట్ కార్డులో రోజువారీ ఖర్చు పరిమితి రూ.2,000, ప్రతి లావాదేవీ పరిమితి కూడా రూ.200 మాత్రమే అని ఆర్‌బీఐ తెలిపింది. ఒకవేళ తగిన బ్యాలెన్స్ లేకపోతే లావాదేవీని రిజెక్టు చేస్తారు. ఈ డెబిట్ కార్డు బ్యాంకు ఖాతాదారులకు, వ్యాపారులకు సౌక‌ర్యంగా ఉంటుంది. ఇంటర్నెట్ లేని సమయాల్లో వర్తకులతో గొడవపడకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. వీసా ఇలాంటి ఒక కొత్త సాంకేతిక‌త‌తో మొదటి సారిగా మనదేశంలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీలు ఇంటర్నెట్ లేని ఫెయిల్ అవుతున్నట్లు గతంలో ఆర్‌బీఐ తెలిపింది. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీ వీసా తీసుకోని వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version