కాంగ్రెస్ క్యాండిడేట్‌ను ఇప్ప‌ట్లో ప్ర‌క‌టించేందుకు ఛాన్స్ లేదంట‌.. ఎందుకంటే..

-

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో హాట్ టాపిక్ గా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉన్న సంగ‌తి అంద‌రికీ విదిత‌మే. కాగా ఈ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు కూడా చాలా సీరియ‌స్‌గా తీస‌కుని ముందుకు పోతున్నాయి. ఇక ఇందులో భాగంగా ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీలు త‌మ క్యాండిడేట్ల‌ను అనౌన్స్ చేసేసి ప్ర‌చారాల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఈ రెండు పార్టీలు కూడా త‌మ ప్ర‌చారంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా సైలెంట్ గా ఉంటోంది. ఇంతటి ప్ర‌తిష్టాత్మ‌క ఎన్నిక‌ల‌ను కూడా చాఆ లైట్ తీసుకుంటోంది.

అయ‌తే మొద‌టి నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున అభ్య‌ర్థి అవుతాడ‌నుకున్న కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ ఎస్ లో జాయిన్ కావ‌డంతో అంతా క్యాండిడేట్ వేట‌లో ప‌డ్డారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో చాలామంది కార్య‌క‌ర్త‌లు కౌశిక్ వెన‌కాలే కాంగ్రెస్ ను వీడారు. దీంతో ఇక్క‌డ పార్టీ బ‌లాన్ని చాలా వ‌ర‌కు కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అభ్య‌ర్థి క‌రువ‌య్యారు. ఇక్క‌డ పోటీ చేసేందుకు కూడా పేరున్న లీడ‌ర్లు ఎవ‌రూ ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో కొత్త చిక్కులు వ‌చ్చి ప్డ‌డాయి.

మాజీ మంత్రి కొండా సురేఖకు టికెట్ ఇస్తార‌ని బాగానే ప్ర‌చారం జ‌రిగినా కూడా ఆమె చాలా షరతులు పెట్ట‌డంతో సీనియర్లు అందుకు అడ్డుప‌డుతున్నారంట‌. ఇక గాంధీ భ‌వ‌న్‌లో దరఖాస్తులు ఇవ్వాల‌ని కోరినా కూడా పెద్ద లీడ‌ర్లు ఎవ‌రూ కూడా ముందుకు రాలేదు. వ‌చ్చిన వారు పోటీ చేసేందుకు స‌రిపోర‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఇలాంటి త‌రుణంలోనే ఉప ఎన్నిక‌లు కూడా వాయిదా ప‌డటంతో కాంగ్రెస్ ఇప్ప‌ట్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేందుకు ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల టైమ్ వ‌చ్చే స‌రికి సీనియ‌ర్ల‌లో ఒక‌రిని ఒప్పించి రంగంలోకి దించాల‌ని చూస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version