తక్కువ వడ్డీకి పర్సనల్‌ లోన్‌ ఇచ్చే బ్యాంకులు ఇవే..

-

నగదు అత్యవసరమైనప్పుడు చాలా మంది వ్యక్తిగత రుణం తీసుకుంటారు.. ఎలాంటి తనఖా లేకుండా ఈ లోన్‌ ఇస్తారు కాబట్టి ఎక్కువగా పర్సనల్‌ లోన్‌ తీసుకునేందుకు జనాలు ముందుకు వస్తారు. బ్యాంకులు కూడా విరివిగా ఇస్తాయి. వ్యక్తిగత రుణాలను నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. పర్సనల్‌ లోన్‌ తీసుకునేప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది.. వడ్డీ రేటు.. వడ్డీ రేటును బట్టే మనం ఎంత ఎక్కువగా కడుతున్నామో తెలుస్తుంది. ఆ తర్వాత టెన్యూర్‌.. ఈ రెండు చాలా ముఖ్యం.. టెన్యూర్‌ తక్కువగా ఉంటే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం తక్కువ వడ్డీకే పర్సలన్‌ లోన్‌ ఇచ్చే బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను లెక్కించేటప్పుడు బ్యాంకులు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఇది సాధారణంగా రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. అతి తక్కువ వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు..

HDFC బ్యాంక్- 10.75% నుండి 24%
ICICI బ్యాంక్- 10.65% నుండి 16.00%
SBI- 11.15% నుండి 11.90%
కోటక్ మహీంద్రా- 10.99%
యాక్సిస్ బ్యాంక్- 10.65% నుండి 22%
ఇండస్ఇండ్ బ్యాంక్- 10.25% నుండి 26%
బ్యాంక్ ఆఫ్ బరోడా- 11.40% నుండి 18.75%
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 11.40% నుండి 12.75%
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 11.35% నుండి 15.45%

రుణం తీసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేటును పొందడానికి ముఖ్యంగా వ్యక్తిగత రుణం పొందడానికి అధిక క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం ముఖ్యం. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటును అందించే అవకాశం ఉంది. అలాగే, పండుగల సీజన్‌లో, తక్కువ వడ్డీ రేట్లను పొందడానికి బ్యాంకులు ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version