ఐదేళ్ల కాలానికి పొదుపు చేయాలనుకుంటున్నారా..? బెస్‌ ప్లాన్స్‌ ఇవే..!

-

ఖర్చులు ఎప్పుడు తక్కువ కాలనికి చేయాలి, కానీ పొదుపు మాత్రం ఎక్కువ సంవత్సరాలకు చేయాలని పెద్దలు అంటారు. సంవత్సరం, రెండు సంవత్సరాలకు పొదుపు చేస్తే మీకు ఏం పెద్దగా డబ్బు రాదు.. కనీసం 5- 20 ఏళ్లు అయినా ఉండాలి. ఐదేళ్ల టెన్యూర్‌లో బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ ఏంటో చూద్దామా.! ఎన్ఎస్‌సీ స్కీమ్ (Scheme) నుంచి యులిప్స్ వరకు పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఎంచుకునే ఆప్షన్ ఆధారంగా మీకు లభించే రాబడి కూడా మారుతూ ఉంటుంది.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఉంది. స్వల్ప కాలం నుంచి మధ్యస్థ కాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది చాలా పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ఇది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఫండ్ మేనేజర్లు ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. మీ డబ్బును వివిధ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. అందుకే రిస్క్ కూడా ఉంటుంది. రాబడి కూడా బాగుంటుంది.

ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్ కూడా ఉంది. ఇది డెట్ ఆధారిత క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. అంటే మీ డబ్బును డెట్ ఫండ్స్‌లో పెడతారనమాట. బ్యాంక్ ఎఫ్‌డీ కన్నా వీకు అధిక రాబడి వస్తుంది. ఇక లిక్విడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటి మెచ్యూరిటీ కాలం 91 రోజులు. స్వల్ప కాలంలో హై లిక్విడిటీ ఆప్షన్ కోరుకునే వారు వీటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్‌తో లింక్ అయ్యి ఈ ఫండ్స్ రిటర్న్ ఉంటుంది. అందువల్ల మీకు నచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎంచుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా ఉంది. వీటిని యులిప్స్ అని కూడా పిలుస్తారు. ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ రెండు రకాల ప్రయోజనాలను ఇందులో పొందొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయెల్ ఆప్షన్ కూడా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్స్‌కు కూడా మార్కెట్‌లో డిమాండ్ బాగుంటుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ) స్కీమ్ కూడా ఉంది. ఈ స్కీమ్ టెన్యూర్ 5 ఏళ్లు. ఇందులో డబ్బులు పెడితే 7.7 శాతం వడ్డీ పొందొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ మాదిరి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version