క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవాలి అనుకుంటే.. ఈ మార్గాలను పాటించాల్సిందే..!

-

సహజంగా ప్రతి ఒక్కరూ ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి సందర్భాల్లో లోన్ తీసుకోవడం సహజమే. ఎప్పుడైతే దానిని సకాలంలో చెల్లిస్తారో, మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది మరియు భవిష్యత్తులో తక్కువ వడ్డీకి మంచి లోన్ ను కూడా పొందవచ్చు. కనుక క్రెడిట్ స్కోర్ ఎప్పుడూ బాగుండే విధంగా చూసుకోవాలి. కొంతమంది వారి అవసరాల కోసం లోన్ తీసుకుంటారు. కానీ సమయానికి చెల్లించకపోవడం వలన క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. దీని వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక, వీటిని పాటించడం వలన మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటుంది.

ఎప్పుడైతే మీ ఆదాయం స్థిరంగా ఉంటుందో, ఎంతో సులభంగా లోన్ పొందవచ్చు. అలాంటి సమయంలో క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా సరే, మీ ఆదాయం వలన లోన్ పొందవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లిస్తారో మరియు తక్కువ మొత్తంలో లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటారో లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా, లోన్ ఇచ్చే వారికి కూడా ఎలాంటి రిస్క్ ఉండదు. కొంతమందికి మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా సరే, లోన్‌కు అప్లై చేయరు. అటువంటి వారితో కలసి లోన్‌కు దరఖాస్తు చేస్తే మీకు సులభంగా లోన్ లభిస్తుంది. ఈ విధంగా వారి క్రెడిట్ హిస్టరీ మీకు ఎంతో సహాయం చేస్తుంది. దీంతో లోన్‌ను సులభంగా పొందవచ్చు.

మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవాలంటే క్రెడిట్ కార్డులో ఎక్కువ బ్యాలెన్స్ ఉండకూడదు మరియు క్రెడిట్ ప్రొఫైల్ లో కనీసం రెండు రకాల లోన్ లు ఉండాలి. సెక్యూరిటీ ఉన్న లోన్ లు ఉంటే సరైన విధంగా క్రెడిట్‌ను నిర్వహిస్తున్నారు అని సంకేతం. కొంతమంది క్రెడిట్ అకౌంట్లకు కో-సైన్ చేస్తారు. ఎప్పుడైతే జాయింట్ అకౌంట్‌లో కలిగి ఉంటారో, మీతో సంబంధం ఉన్నవారు సకాలంలో చెల్లించకపోయినా, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. కనుక, వాటిని క్రమంగా చెల్లించే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కొన్ని మార్గాలను పాటిస్తే, క్రెడిట్ స్కోర్ దెబ్బ తినకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news