Rajeev yuva vikas: తెలంగాణ రాష్ట్ర యువతకు అదిరిపోయే శుభవార్త చెప్పారు తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. జూన్ రెండవ తేదీన అకౌంట్లోకి డబ్బులు వేస్తామని ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది.

ఈ విషయం పైన బ్యాంకర్లతో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశమైనట్లు తెలిపింది. మొత్తం తొమ్మిది వేల కోట్లతో చేపడుతున్న ఈ పథకానికి 6250 కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఐదు లక్షల మంది.. ఈ స్కీం లో లబ్ధిదారులు అవుతారని… పేర్కొంది. దీంతో తెలంగాణ యువత హర్షం వ్యక్తం చేస్తుంది.