ఏటీఎం పిన్ కి నాలుగు అంకెలే ఎందుకు వుంటాయో తెలుసా…?

-

సాధారణంగా ఏటీఎం పిన్ కి నాలుగు నెంబర్లు ఉంటాయి. మనం ఏటీఎం కి ఎప్పుడు వెళ్ళినా కార్డు పెట్టి నాలుగు నెంబర్లుని ఎంటర్ చేస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు జరపాలంటే ఏటీఎం కార్డు కూడా చాలా అవసరం.

అలానే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా క్యాష్ తీయాలంటే ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్లి ఏటీఎం కార్డు స్వైప్ చేసి డబ్బులు తీస్తూ ఉంటాం. దాని కోసం మనకి నాలుగు నెంబర్లు పిన్ అవసరం. అయితే పిన్ కి ఎందుకు నాలుగు నెంబర్లు ఉంటాయి..? అంత కంటే ఎక్కువ, తక్కువ ఎందుకు ఉండవు అనేది ఇప్పుడు చూద్దాం. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఈ మిషన్ ని బ్రిటిష్ దేశస్థుడు అయిన జాన్ అడ్రియన్ షెవ‌ర్డ్ బార‌న్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది.

అయితే ఈ మిషన్ ని అతను ఉపయోగించే సమయంలో ఆరు నెంబర్లు గల పిన్ ని పెట్టాడు. అతని భార్య ఈ ఆరు అంకెల ఏటీఎం పిన్ ని ఒప్పుకోలేదు. ఏటీఎం కి వెళ్ళిన ప్రతిసారి ఆరు నెంబర్స్ గుర్తు పెట్టుకోవాలంటే కష్టమవుతుందని చెప్పింది.

అందుకని ఆరు కంటే కూడా నాలుగు అంకెల సులభంగా గుర్తు పెట్టుకోవచ్చని ఇలా పిన్ ని మార్చడం జరిగింది. అప్పటి నుండి కూడా ఏటిఎం పిన్ నాలుగు అంకెల తో ఉంటుంది. నిజానికి నాలుగు అంకెల అయితే మనము సులువుగా గుర్తు పెట్టుకోవచ్చు కదా అందుకనే ఇప్పటికీ కూడా నాలుగు అంకెలు ఉపయోగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news