15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్… జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్

-

cination15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన క్రమంలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జవవరి 3, 2022 సోమవారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీని కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నట్లు కోవిన్ ఫ్లాట్ ఫారమ్ ఛీప్ డా. ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్న చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డ్ తో కోవిన్ యాప్ ద్వారా టీకా తీసుకునే వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఒక వేళ ఆధార్ కార్డ్ లేకుంటే.. చదివే విద్యా సంస్థ గుర్తింపు కార్డు ద్వారా టీకాను బుక్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

మరోవైపు ఆరవై ఏళ్లకు పైబడిన వారికి కూడా ఇదే విధంగా రిజస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే రెండు డోస్‌లు తీసుకున్నట్లయితే మరియు రెండవ డోస్ మరియు మీరు నమోదు చేసుకున్న రోజు మధ్య గ్యాప్ 9 నెలల కంటే ఎక్కువ (39 వారాలు) ఉంటే మీరు అర్హులని ఆయన ఆర్ఎస్ శర్మ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news