వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు బంద్…!

-

ఒక పక్క కరోనా వైరస్ నేపధ్యంలో అన్ని రంగాలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. జనాలు బయటకు రావడానికి భయపడటంతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇప్పుడు జనాలకు మరో సమస్య వచ్చి పడింది. వచ్చే వారం ఏకంగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవలు రానున్నాయి. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చడాన్ని వ్యతికిస్తూ,

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్-AIBEA, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు 27న సమ్మె ప్రకటించాయి బ్యాంకులు. వచ్చే వారంలో ఉగాది సేవలు ఉంది. అలాగే వీకెండ్ హాలిడేస్ ఉన్నాయి. దీనితో నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవలు రానున్నాయి. దీనితో ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

మార్చి 25 బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ, మార్చి 26న బ్యాంకులు పని చేస్తాయి. 27న బ్యాంకు ఉద్యోగుల సమ్మె, మార్చి 28 నాలుగో శనివారం, మార్చి 29 ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా అన్ని వ్యాపార సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ వారంలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవలు అనగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version