క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గిస్తున్న బ్యాంకులు…!

-

కరోనా దెబ్బకు ఆర్ధికంగా ప్రజలు చాల వరకు నష్టపోయిన సంగతి తెలిసిందే. చాలా మందికి ఉద్యోగాలు, వ్యాపారాలు ఇతరత్రా ఆదాయాలు భారీగా పడిపోయాయి. దీనితో ఇప్పుడు బ్యాంకు లు కూడా ప్రజలకు ఆర్ధికంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ తరుణంలో బ్యాంకు లకు ఒక రకమైన భయం పట్టుకుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డుల బిల్లులు జనం కడతారా లేదా అనే ఆందోళన ఉంది.

ఈ తరుణంలో కీలక బ్యాంకు లు అన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రైవేట్ బ్యాంకు లు భవిష్యత్తుని దృష్టి లో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రేడ్ కార్డ్ లిమిట్ ని బాగా తగ్గించాయి. ఈ మేరకు రంగం సిద్దం చేసుకుని చర్యలకు దిగాయి. క్రెడిట్ కార్డ్ ల వాడకం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఇప్పటికే బిల్లులు చెల్లించడం లేదు చాలా మంది. చిరు వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరికి క్రెడిట్ కార్డులు ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్ధిక పరిస్థితి మరీ దిగజారే అవకాశం ఉందని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో క్రెడిట్‌ కార్డు వినియోగదారులు సుమారుగా 40 లక్షల వరకు ఉంటారని, వారిలో సగం మంది బిల్లులు కట్టడం లేదని బ్యాంకు లు ఆందోళన లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version