సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్న బన్ని భార్య.. హీరో ఎవరంటే..?

-

ఒకప్పుడు స్టార్ హీరోల భార్యలు మీడియా వైపు కూడా కన్నెత్తి చూసేవారు కాదు.. కానీ తరం మారిపోయింది ప్రస్తుతం స్టార్ హీరోల భార్యలు కూడా ఇండస్ట్రీలో ఒక భాగం కావాలి అని.. తాము కూడా సినిమాలలో నటించాలని ఆలోచనలు చేస్తున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఒకరు. మొన్నటి వరకు గ్లామర్ షో తో సోషల్ మీడియాలో మంటరాజేసిన ఈమె.. ఇప్పుడు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ , పిల్లలతో ఉన్న ఫోటోలు , వీడియోలు అప్డేట్ చేయడమే కాదు ఫోటోషూట్స్ తో కూడా సందడి చేస్తూ.. ఖరీదైన దుస్తులు ధరించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. అంతేకాదు హీరోయిన్లను మించిన అందంతో హాట్ హాట్ ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూంది.

ఈ క్రమంలోనే బాగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు స్నేహకు ఒక మలయాళం సినిమాలో నటించే అవకాశం దక్కింది అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరో మలయాళం స్టార్ హీరో అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈమె పాత్ర ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.. ఇప్పుడెలాగో ఈమె హీరోయిన్గా చేసే అవకాశం లేదు మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుందా లేదా కీలకపాత్ర ఉన్న రోల్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న అల్లు స్నేహ ఇప్పుడు సినిమాలలో కూడా అభిమానులను సంపాదించే పనిలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ క్రేజ్ బన్నీ భార్యకు కూడా వచ్చే అవకాశం ఉంది . అందుకే అల్లు స్నేహ మలయాళం లో ఎంట్రీ ఇవ్వబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరొకవైపు పుష్ప సీక్వెల్ మూవీ షూటింగ్ ను కూడా అక్కడే మొదలుపెట్టబోతున్నారు. ఇలా రెండు రకాలుగా వీరికి బాగా కలిసొస్తుందని పెద్ద ప్లాన్ వేస్తోంది ఈ జంట. మరి ఎలాంటి సక్సెస్ పొందుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version