బాస్కెట్​బాల్ ప్లేయర్ జోర్డాన్​ బూట్లు.. వేలంలో రికార్డ్ స్థాయిలో ధర

-

బాస్కెట్​ బాల్​ దిగ్గజం​ మైకేల్​ జోర్డాన్​ ధరించిన బూట్లు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇటీవలే క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలో ఏకంగా 6.15 లక్షల డాలర్లు పలికినట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకుముందు జోర్డాన్​ వేరే షూస్ మంచి ధర పలకగా.. తాజా వేలంలో ఆ రికార్డు బ్రేక్ అయింది. 1985లో ఇటలీలో జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో జోర్జాన్​ ఈ బూట్లను ధరించాడు. ఆ సమయంలో బంతిని గట్టిగా తన్నగా.. గాజు బ్యాక్​ బోర్డు ముక్కలపోయింది.

Mickel shoe

ఇక మే నెలలో జోర్జాన్​ తొలి బూట్ల జత 5.60 లక్షల డాలర్లకు అమ్మడుపోయాయి. అయితే, కొత్తగా జరిగిన వేలంలో కనీసం 6.50 నుంచి 8.50 లక్షల డాలర్ల వరకు పలుకుతుందని ఆశించారు. కానీ 6.15 డాలర్లకు మాత్రమే అమ్ముడుపోయాయి.సీనీ తారలు, క్రీడాకారుల వస్తువులు ఈ విధంగా వేలం వెయ్యడం వాటి ద్వారా వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version