సీఎం జగన్ పై హీరో రామ్ సంచలన ట్వీట్

-

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నాయకులు నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఎవరూ ఊహించని విధంగా సినిమా హీరో రామ్ పోతినేని స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కి వెన్నుపోటు పొడుస్తున్నారని, సీఎం కింద ఉన్న వ్యక్తులే ఈ పనులు చేస్తున్నారని హెచ్చరించారు. స్వర్ణ ప్యాలస్ ఘటన అగ్ని ప్రమాదం నుంచి ఫీజు వైపు మళ్లించారని.. ఈ విధంగా మార్పు చేసి అందర్నీ ఫుల్ చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ అంటూ ట్విట్టర్ వేదికగా అనూహ్యంగా స్పందించారు హీరో రామ్. స్వర్ణ ప్యాలెస్ మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది అని బిల్లుల వివరాలు తన సామాజిక మాధ్యమ ఖాతా లో పోస్ట్ చేశారు. ఈ విధంగా హీరో రామ్ స్పందిస్తారని ఎవరూ ఊహించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version