బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు,తొమ్మిది రుపాలు.. ప్రత్యేక పాటలు..

-

బతుకమ్మ పండుగ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు..తెలంగాణ సంస్కృతి, కట్టు, బొట్టుకు ప్రతీక..సంస్కృతి,సాంప్రదాయాలకు ఈ పండుగ కెరాఫ్ అనే చెప్పాలి..ఈ పండుగను ప్రకృతిని ఆరాధించే పండగ అని అంటారు.ఈ పండుగను తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో, తొమ్మిది పేర్లతో పిలుస్తారు. అలా చేసి ప్రత్యేక నైవెద్యాలు,పాటలు,ఆటలు,డాన్స్ లు వేస్తారు.తెలంగాణలోని ప్రతి మహిళ ఈ పండుగకు ప్రత్యేకంగా రెడీ అయ్యి బతుకమ్మ ఆట లో పాల్గొంటారు.ఆ తొమ్మిది రోజులు అమ్మవారి పేర్లు,అలంకరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రోజుకో రకమైన పూలతో, రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. అవేంటో, వాటి ప్రత్యేకతలేంటో చూద్దాం..

ఎంగిలిపూల బతుకమ్మ:

మహాలయ అమవాస్య రోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ:
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ:
ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ:
నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ:
అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ:
ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ:
బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ:
నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ:
ఆశ్వయుజ అష్టమినాడు అదేరోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు..

బతుకమ్మ పండుగ స్పెషల్ పాటలు..

ఏమిమి పువ్వోప్పునే గౌరమ్మ

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే
తంగేడు పువ్వులో తంగేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (1)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
తెలుగంటి పువ్వోప్పునే గౌరమ్మ తెలుగంటి కాయప్పునే
తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (2)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే
ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (3)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
జిల్లేడు పువ్వోప్పునే గౌరమ్మ జిల్లేడు కాయప్పునే
జిల్లేడు పువ్వులో జిల్లేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (4)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
మందార పువ్వోప్పునే గౌరమ్మ మందార కాయప్పునే
మందార పువ్వులో మందార కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
గుమ్మడి పువ్వోప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే
గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
గన్నేరు పువ్వోప్పునే గౌరమ్మ.. గన్నేరు కాయప్పునే
గన్నేరు పువ్వులో గన్నేరు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (6)
బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట ప్రతి వీధిలోనూ మారుమ్రోగుతూనే ఉంటుంది.

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (1)
రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే
రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (2)
వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే
వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (3)
బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే
భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (4)
పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే
పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (5)
ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (6)
ఈ వాడ వాడవాడల్లోన బతుకుమ్మ సమయంలో మార్మోమ్రోగుతుంది.

శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో

శుక్రవారమునాడు ఉయ్యాలో
చన్నీటి జలకాలు ఉయ్యాలో
ముత్యమంత పసుపు ఉయ్యాలో
పగడమంత పసుపు ఉయ్యాలో
చింతాకుపట్టుచీర ఉయ్యాలో
మైదాకు పట్టుచీరు ఉయ్యాలో
పచ్చపట్టుచీరు ఉయ్యాలో
ఎర్రపట్టుచీర ఉయ్యాలో
కురుసబొమ్మల నడుమ ఉయ్యాలో
భారీ బొమ్మల నడుమ ఉయ్యాలో
గోరంట పువ్వుల ఉయ్యాలో
బీరాయిపువ్వుల ఉయ్యాలో
రావెరావె గౌరమ్మ ఉయ్యాలో
లేచెనే గౌరమ్మ ఉయ్యాలో
అడెనే గౌరమ్మ ఉయ్యాలో
ముఖమంత పూసింది ఉయ్యాలో
పాదమంత పూసింది ఉయ్యాలో
చింగులు మెరియంగ ఉయ్యాలో
మడిమల్లు మెరియంగ ఉయ్యాలో
పక్కలు మెరియంగ ఉయ్యాలో
ఎముకలు మెరియంగ ఉయ్యాలో
కుంకుమబొట్టు ఉయ్యాలో
బంగారు బొట్టు ఉయ్యాలో
కొడుకు నెత్తుకోని ఉయ్యాలో
బిడ్డ నెత్తుకోని ఉయ్యాలో
మా యింటి దనుక ఉయ్యాలో

ఒక్కేసి పువ్వేసి చందమామ రాశికలుపుదాం రావె చందమామ

ఒక్కేసి పువ్వేసి చందమామ
రాశికలుపుదాం రావె చందమామ
నీరాశి కలుపుల్లు మేం కొలువమమ్మ
నీనోము నీకిత్తునే గౌరమ్మ
అదిచూసిమాయన్న గౌరమ్మ
ఏడుమేడల మీద పల్లెకోటల మీద
దొంగలెవరో దోచిరీ గౌరమ్మ
దొంగతో దొరలందరూ గౌరమ్మ
రెండేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ
మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ
రాశిపడబోసి చందమామ
రత్నాలగౌరు చందమామ
తీగెతీగెల బిందె రాగితీగెల బిందె
నానోమునాకీయవే గౌరమ్మ
ఏడుమేడలెక్కిరి గౌరమ్మ
పల్లకోటల మీద పత్రీలు కోయంగ
బంగారు గుండ్లుపేరు గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

ఈ పాటలన్నీ బతుకమ్మ సమయంలో ప్లే అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ పాటలు పాడుతూ.. బతుకమ్మను సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు..

Read more RELATED
Recommended to you

Latest news