తెలంగాణలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెల 30న గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ గ్రౌండ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరవీరుల స్మారక చిహ్నం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి పువ్వులను చల్లి వారికి ఘనంగా స్వాగతం పలకనున్నారు. 28న ఎల్బీ స్టేడియంలో 20,000 మందితో బతుకమ్మను ఆడించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా… కేవలం తెలంగాణలో మాత్రమే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పూలతో పండుగను చేసుకునే సాంప్రదాయం తెలంగాణలోనే ఉంది. ఇంటింటికి తప్పకుండా బతుకమ్మను చేస్తారు. రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మను పూజిస్తారు. కొత్త బట్టలు ధరించి స్త్రీలు బతుకమ్మను ఆడుతారు. అనంతరం బతుకమ్మలను నీటిలో వేసి ఇంటికి తిరిగి వస్తారు.