#BB3 First Roar: “అమ్మ మొగుడు” డైలాగ్ పై నానీ రియాక్షన్?

-

హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ టాప్ హీరో, నందమూరి బాలకృష్ణ 60వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. పైగా ఇది బాలయ్యకు షష్టి పూర్తి ఏడాది కూడా కావడంతో అది కాస్త పీక్స్ కి చేరుతుంది. ఈ సందర్భంగా ఆన్ లైన్ లో వివిధ మాధ్యమాల ద్వారా బాలయ్యకు పుట్టిన రోజు శభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు హడావిడి చేస్తున్నారు. వాళ్ల హడావిడికి ఏమాత్రం తగ్గకుండా బాలయ్య కూడా తన 106 సినిమా టీజర్ రిలీజ్ చేశారు.. ఫలితంగా సంబరాలను రెట్టింపు చేశారు. ఆ సంగతి అలా ఉంటే… ఆ టీజర్ లో బాలయ్య చెప్పిన “అమ్మ మొగుడు” అనే డైలాగే ఇప్పుడు అటు సినిమా, ఇటు రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. ఇది కచ్చితంగా కొడాలి నానీని దృష్టిలో పెట్టుకునే సినిమాలో పెట్టారు, టీజర్ లో వదిలారు అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైపోయింది.

బోయపాటి – బాలయ్య హిట్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా టీజర్ లో బాలయ్య.. ఎప్పుడూ కనిపించన లుక్ లో, తెల్ల షర్టు, తెల్ల లుంగీ కట్టుకుని, మీసం తిప్పి ఉన్న మాస్ లుక్ అభిమానులకు ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కన్ ఫాం అనే సంకేతాలు ఇస్తుంటే… ఇక బాలయ్య చెప్పిన డైలాగ్ అయితే, బాలయ్య ఫ్యాన్స్ తో పాటు టీడీపీ కార్యకర్తలకు మరింత ఊపు తీసుకొచ్చిందనే చెప్పాలి. “ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో” అంటూ మొదలుపెట్టిన బాలయ్య… “శీనుగారూ మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి… శ్రీనుగారు మీ అమ్మా మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా లంబిడీకొడకా” అని ముగించారు. దీంతో ఇది కచ్చితంగా ఏపీ మంత్రి కొడాలి నాని ని దృష్టిలో పెట్టుకునే పెట్టారు అని ఆల్ మోస్ట్ అంతా కన్ ఫాం అయిపోతున్నారు!

అయితే… ఈ విషయంపై కొడాలి నాని తన సన్నిహితుల వద్ద స్పందించారని తెలుస్తుంది. అయితే ఈ డైలాగ్ పై ఏమాత్రం సీరియస్ గా స్పందించని నాని… ఇవన్నీ మామూలే, అలాంటివి కూడా పట్టించుకుంటే ఇక్కడ ఉండలేం, అది చాలా చిన్న విషయం అని అన్నారంట. అయితే ఈ విషయంలో కొడాలి నాని అభిమానులు మాత్రం… బాలయ్య – రీల్ హీరో, కొడాలి నాని – రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు! కాగా… ఏపీ టీడీపీ నేతలను నేరుగా మైకులముందే “నీ అమ్మ మొగుడు” అనే పదాలతో నాని ఫైరయిన సంగతి తెలిసిందే!!

Read more RELATED
Recommended to you

Exit mobile version