యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ లేటెస్ట్ సెన్సషనల్ మూవీ బేబీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్ లలోకి వచ్చి ఇప్పటికి మూడు వారలు అవుతున్నా ఇంకా కలెక్షన్ లు నిలకడగా వస్తున్నాయి. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య లు హీరో హీరోయిన్ లుగా నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా విఫరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది, ముఖ్యంగా ప్రేమికులు అయితే గుండెల్లో పెట్టుకుని ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి 2023 సెకండాఫ్ లో మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా విజయంతో ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు, నిర్మాతలు మరియు హీరోలు అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా ఈ సినిమా గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం డైరెక్టర్ సాయిరాజేష్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ సాయి రాజేష్.