నిన్న బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ చేతన్ శర్మ అనంతరం కొత్త బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఇండియా తరపున 26 టెస్ట్ లు , 191 వన్ డే లు మరియు 4 టీ 20 లు ఆడిన అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ అజిత్ అగార్కర్ ను ఎంపిక చేసింది. ఈ రోజు నుండి అజిత్ అగార్కర్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా పదవిని అందుకున్నాడు. కాగా ఇతని జీతం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మొదటగా బీసీసీఐ ఈయనకు కోటి రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఇస్తామని చెప్పడంతో, ఇందుకు అంగీకరించని అగార్కర్ సంవత్సరానికి మూడు కోట్లు కావాల్సిందిగా డిమాండ్ చేయడంతో అందుకు బీసీసీఐ సరే అని మూడు కోట్లు ఫైనల్ చేసిందట.
కానీ రాగానే బీసీసీఐ ను డిమాండ్ చేసిన అజిత్ అగార్కర్ ఎలా మనగలుగుతాడో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక మొదటగా తాను వెస్ట్ ఇండీస్ తో ఆడనున్న మెన్ టీ 20 జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.