బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటించే షెడ్యూల్ ను బీసీసీఐ మార్చింది. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులు బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. షెడ్యూల్ మార్పునకు.. కోహ్లి ఫ్యాన్స్ ఫైర్ అవడానికి మధ్య సంబంధం ఎంటంటే..? మాజీ కెప్టెన్ ఇప్పటి వరకు వన్డెలలో 99 మ్యాచ్ లు ఆడాడు. దీంతో శ్రీలంకతో జరగబోయే మొదటి టెస్టుతో విరాట్ కోహ్లి తన కేరీర్ లో 100వ టెస్టు మ్యాచ్ ను ఫినిష్ చేస్తాడు.
అయితే శ్రీలంక సిరీస్ కు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం మొదటి టెస్టు మ్యాచ్ వేదిక విరాట్ కోహ్లికి ఎంతో ఇష్టమైన బెంగళూర్ లో జరగాల్సింది. అయితే ప్రస్తుతం బీసీసీఐ షెడ్యూల్ ను మార్చి బెంగళూర్ లో మొదటి టెస్టు మ్యాచ్ ను నిర్వహించడం లేదు. అయితే ఐపీఎల్ ద్వారా బెంగళూర్ కు విరాట్ కోహ్లి చాలా దగ్గర సంబంధాన్ని ఏర్పర్చుకున్నారు. కాగ బెంగళూర్ లో మొదటి టెస్టు మ్యాచ్ కాకుండా రెండో టెస్టు మ్యాచ్ ను నిర్వహించేలా బీసీసీఐ షెడ్యూల్ ను మార్చింది.
దీంతో కోహ్లిపై కోపంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆర్సీబీ, కోహ్లి అభిమానులు బీసీసీఐ పై ఫైర్ అవుతున్నారు. కాగ బీసీసీఐ కొత్త షెడ్యూల్ ప్రకారం ఇండియా, శ్రీలంక మధ్య 1వ టీ 20 ఈ నెల 24న లక్నోలో, రెండు, మూడు వరుసగా 26,27 తేదీలలో ధర్మశాలలో నిర్వహిస్తారు. అలాగే మార్చి 3న తొలి టెస్టు మొహాలీలో, రెండో టెస్టు మార్చి 12న బెంగళూర్ లో నిర్వహిస్తారు.