పెంపుడు కుక్కలతో జాగ్రత్త…

-

కరోనా వైరస్ ఇప్పుడు జంతువులకు రావడం ఏమో గాని ప్రపంచ దేశాలు అన్నీ కూడా భయపడి చస్తున్నాయి. అమెరికాలో పులికి కరోనా వైరస్ సోకింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అక్కడ జూ లో పని చేసే వ్యక్తి ద్వారా పులికి కరోనా వైరస్ సోకడం తో అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు జూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ జంతువులను కాపాడుతున్నారు.

ఇక తమిళనాడు లో కాకులకు కరోనా వైరస్ వచ్చింది అనే వార్త కూడా మన దేశాన్ని కంగారు పెట్టింది. ఇది పక్కన పెడితే… ఇప్పుడు పాకిస్తాన్ లో పెంపుడు కుక్కలకు భారీగా కరోనా వైరస్ సోకుతుంది. 20 కుక్కలు ఇప్పుడు పాకిస్తాన్ లో కరోనా వైరస్ కారణంగా చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. అక్కడి ప్రభుత్వం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. కుక్కలు మనుషులకు చాలా దగ్గరగా ఉంటాయి.

ఇక అవి వీధుల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్న తరుణంలో ఇలా కాకులకు జంతువులకు కరోనా రావడం ఏంటీ అనే ఆందోళన వ్యక్తమవుతుంది. పరిస్థితి చేయి దాటిపోయింది అనే అనుమానాలు ఇక్కడే వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు. అన్ని దేశాలు కూడా ఇప్పుడు మనుషులతో పాటు జంతువులను కూడా కాపాడుకునే పనిలో పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version