మొదట ఇయర్ ఫోన్స్ అంటే..వైర్ తో వచ్చేవి..ఆ ట్రెండ్ పోయింది..నెక్ బ్యాండ్ తో వచ్చావి..ఆ మోజు తీరింది..ఇప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ హవా నడుస్తుంది. యువతలో ఎక్కవు మంది..వీటిని కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. నెక్ బ్యాండ్ తో వచ్చేవి ఎక్కువసేపు మెడలో ఉంచుకోవటం వల్ల చిరాకు, మంట అనిపిస్తుందట. ఇవి అయితే..హ్యాపీగా వాడేసుకోవచ్చు. అయితే..వీటిని క్లీన్ చేసుకోవటం మనం అయితే..ఏ లిక్విడో వేసి..శుభ్రం చేసుకుంటాం. కానీ వాషింగ్ మిషన్ లో ఇయర్ ఫోన్స్ వేస్తే ఎలా ఉంటుంది. ఏం ఉంటది..పాడైపోతాయి అనుకుంటున్నారా..కానీ ఈ బుల్లి వాషింగ్ మిషన్ ఉన్నదే..మీ బ్యూటూత్ ఇయర్ ఫోన్స్ క్లీన్ చేయటానికి.
యాపిల్ AirPods, బోస్ QuietComfort, శాంసంగ్ Buds Pro, Jabra వంటి కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ వాడే వారికి ఈ బుల్లి వాషింగ్ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుందని తయారీదారుడు పేర్కొన్నాడు. ఇక ఇటీవల జరిగిన ఓ ఎలక్ట్రానిక్ ఎక్జిబిషన్ షోలో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. దీని ధర డెలివరీ చార్జీలతో కలుపుకుని సుమారు US $45లుగా ఉంటుంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.