దక్షిణాఫ్రికా కంట్రీలో పురుడు పోసుకున్న ఓమిక్రాన్ మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ 90 దేశాలకు పైగా పాకింది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో… కరోనా మహమ్మారి వ్యాప్తిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పెరుగుతున్న కరోనా కేసులతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డెల్టా మరియు ఓమిక్రాన్ వేరియంట్ తో కరోనా కేసులు సునామి వార్నింగ్ ఇచ్చింది డబ్ల్యూహెచ్ ఓ. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వాలు కూడా తక్షణమే దీని పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకటన చేసింది. కాగా ఇండియాలో ఓమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 961కి చేరింది. ఇప్పటి వరకు ఓమిక్రాన్ బారి నుంచి 320 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 641 గా ఉంది. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలను విధించడంతో పాటు.. న్యూ ఇయర్ వేడుకలను నిషేధిస్తున్నాయి.