కురులు ఒత్తుగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఒత్తైన కురుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జనం. ముఖ్యంగా అమ్మాయిలూ, ఆడవాళ్ళు అయితే ఒత్తు జుట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల మందులు కూడా వాడుతూ ఉంటారు. అదే విధంగా షాంపులు కూడా పదే పదే మారుస్తూ ఉంటారు. దీని వలన పెద్దగా ప్రయోజనం ఉండదు.
అయితే కొన్ని కొన్ని పాటిస్తే కచ్చితంగా జుట్టు ఒత్తుగా ఉంటుందని అంటున్నారు వైద్యులు. దాని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఒక బౌల్‌లో ఒక టేబుల్‌స్పూను కలబంద గుజ్జు, ఒక టేబుల్‌స్పూను కొబ్బరినూనె, ఒక టేబుల్‌స్పూను ఆలివ్ నూనె, అంతే పరిమాణంలో బాదం నూనె, ఒక విటమిన్ ఇ క్యాప్స్యూల్ తీసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి.
వెంట్రుకలను విడదీసి కుదుళ్లకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి. మునివేళ్లతో గోళ్లు తగలకుండా, వృత్తాకారంలో కుదుళ్లకు మర్దన చేయాలి. తర్వాత తలకు తువ్వాలు చుట్టుకుని పడుకుని ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి రెండు నెలల పాటు చేస్తే, కుదుళ్లు బలపడి వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.