బ్యూటీ స్పీక్స్ : అందం అమ్మాయ‌యితే..వ‌కీల్ సాబ్ ఫేం అన‌న్య

-

ఆకాశం అమ్మాయి అయితే అన‌న్య నాగ‌ళ్ల
ఆనందం అల్లరి చేస్తే అన‌న్య నాగ‌ళ్ల
ఈ రెండూ క‌లిపితే అందం ఆనందం అల్ల‌రి
మూడు క‌లిసి అన‌న్య సామాన్య ప్ర‌తిభ‌కు తోడు
కావాల‌ని కోరుకోవాలి మ‌నం.

అందం అభిన‌యం ఉంటే తెలుగు అమ్మాయిలు గ్లామ‌ర్ ఫీల్డ్ లో రాణించ‌డం సులువు అని అనేందుకు లేదు. కానీ ఆ మాట కూడా కొట్టిపారేసేలా రెండు ప్రెస్టీజియ‌స్ మూవీస్ లో న‌టించి మంచి మార్కులే సంపాదించుకున్నారు ఆమె. కొత్త సినిమా ఊసులేవీ ఆమె నుంచి తెలియ‌కున్నా ఇవాళ్టికీ ఆమెను ప‌వ‌న్ అభిమానులు ఫాలో అవుతూనే ఉన్నారు. వ‌కీల్ సాబ్ లో ఆమె ఓ బాధితురాలిగా న‌టించిన తీరు ఎంతో బాగుంద‌ని,ఇలాంటి వారు ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని తీరాల‌ని కూడా ఇంకొంద‌రు ఈ మ‌హిళా దినోత్స‌వ వేళ అంటున్న మాట.ఆకాంక్ష కూడా!

ఖమ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన అన‌న్య నాగ‌ళ్ల ఇప్పుడు కొత్త సినిమాలకు సంబంధించిన క‌థ‌లను వినే ప‌నిలో ఉన్నారు. కొత్త ప్రాజెక్టుల‌ను ఎంచుకునే ప‌నిలో ఉన్నారు.అంతేకాదు డిజిట‌ల్ మీడియాలో ఆమె ఓ అట్రాక్ష‌న్ పాయింట్ గా కూడా ఉన్నారు.

వ‌కీల్ సాబ్ ఫేం అనన్య నాగ‌ళ్ల ఇవాళ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా నెటిజ‌న్ల‌ను ప‌ల‌క‌రించారు. తెల్ల రంగు చీర‌పై నీలి రంగు పూల‌ను అల‌కరిస్తూ రూపొందించిన చీర‌లో ఆమె అటు ప‌వ‌న్ అభిమానుల‌నూ ఇటు త‌న అభిమానులనూ అల‌రించారు. Happy women’s day ..A reminder to love yourself ..అని ఓ సందేశం రాసి అందాల భామ త‌న ఆనందాల‌ను పంచుకున్నారు. అనూహ్య రీతిలో సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగిడిన అన‌న్య అచ్చ తెలుగు అందం.

తెలంగాణ బిడ్డ.మ‌ల్లేశం సినిమాతో ఒక్క‌సారిగా అంద‌రి మ‌న‌సూ దోచుకున్న ఈ చిన్న‌ది అటుపై ఎన్నో అవ‌కాశాలు అందుకున్నారు. ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ లో అమాయ‌క‌మ‌యిన ప‌ల్లె ప‌డుచుగా న‌టించి మెప్పించారు. రెండే రెండు సినిమాల‌తో ఆమె జీవితం ఎంతో మారిపోయింది. మ‌ధ్య ప్లే బ్యాక్ అనే సినిమాలో న‌టించిన‌ప్ప‌టికీ ఆ సినిమా క‌న్నా వ‌కీల్ సాబ్ సినిమానే ఎక్కువ పేరు ఇచ్చింది.

– బ్యూటీ స్పీక్స్ – మ‌న లోకం ప్రత్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version