కమిషన్లతో మీ ఫామ్ హౌజ్ నింపుకోవడానికి రాష్ట్రాన్ని ఆగం చేశారు. వైెఎస్ షర్మిళ సంచలనం

-

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఫైర్ అయ్యారు. కమిషన్లతో మీ ఫామ్ హౌజ్ నింపుకోవడానికా రాష్ట్రాన్ని ఆగం చేశారని సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణను తెగనమ్మతేగానీ ఆదాయం రాని పరిస్థితి ఉందని విమర్శిచారు. భూముల జాగలు అమ్మాలి.. జనానికి లిక్కర్ తాగించాలి… లేదంటే అప్పుల తేవాలని ఎద్దేవా చేశారు. ఏడేళ్లలో 7 రెట్లు అప్పులు చేసి 5 లక్షల కోట్లకు చేర్చారని ఆరోపించారు. ఏడాదికి 30 వేల కోట్లు మీరు చేసిన అప్పులు మిత్తీలకే సరిపోతే… ఇక రాష్ట్రాన్ని నడిపే ఇగురం ఏది అని ప్రశ్నించారు. 

బంగారు తెలంగాణ చేసిన అని చెప్పుకుంటున్న దొరగారు.. 5 లక్షల కోట్లు అప్పు ఎవరికోసం చేశారని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపారా..? పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా?. తెలంగాణ అమరవీరులను ఆదుకున్నారా..? కార్పొరేషన్స్ లోన్స్ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. కమిషన్లతో మీ ఫామ్ హౌజ్ నింపుకోవడానికి రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version