జిడ్డు చర్మంతో సతమతమవుతున్నారా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

-

కొద్దిసేపటికే ముఖం జిడ్డుగా మారుతుంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు మొటిమలు పెరిగిపోతాయి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు తరచుగా ముఖాన్ని చల్లని నీటితో కడగడం, తాజా పండ్లను తినడం, అలాగే వారానికి రెండు సార్లైనా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వంటివి చేయాలి.

ఫేస్ ఫ్యాక్ లు :

రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పొడిలో అంతే మోతాదు వేపాకు రసం, చందనం పొడి, రెండు మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకొని ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి.

తాజా పుదీనా ఆకులను తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసి , దీనిలో పావు కప్పు పండిన బొప్పాయి గుజ్జు, రెండు టీ స్పూన్ల పెసరపిండి, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడిలో అంతే మోతాదులో తేనె , అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి.

ముఖం మీద జిడ్డు తో పాటు మొటిమలతో కూడా బాధపడుతుంటే రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి లో అంతే మోతాదు చందనం పొడి రెండు చుక్కల వెల్లుల్లి రసం ఒక స్పూన్ పసుపు వేసుకుని ఈ మిశ్రమాన్ని ప్యాక్ లాగా ముఖానికి రాసుకోవాలి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే మేలైన నిగారింపు మీసొంతం.

Read more RELATED
Recommended to you

Exit mobile version