సన్యాసిగా మారా బైబిల్ చదివా మతం ఒక దోపిడీ అని తెలుసుకున్నా.. రాజమౌళి వైరల్ కామెంట్స్

-

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన పాత్రల్ని తీర్చిదిద్దే తీరు సినిమాని తెరకెక్కించే విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఆయన తాజాగా తెరకెక్కించిన ఆర్ఆర్అర్ చిత్రం ప్రపంచ వేదికపై ఏ స్థాయి గౌరవాన్ని దక్కించుకుందో తెలిసిందే. ఈ సినిమాలో నాటు నాటు పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం దక్కించుకుంది. ఇప్పటికే పలు అవార్డును అందుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో సైతం నిలిచింది.. ఈ సందర్భంగా ఓ విదేశీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తన జీవితానికి, భక్తి విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తాజాగా రాజమౌళి ఓ విదేశీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మతానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది.. అయితే రాజమౌళి నాస్తికుడని అందరూ అనుకుంటారు కానీ ఇది నిజం కాదట. గతంలో రాజమౌళి దేవుడిని ప్రగాఢంగా విశ్వసించే వాడినని చెప్పుకొచ్చారు. తన తల్లి తండ్రి అత్తమామలు మేనమామలు తో పాటు కుటుంబం అందరూ చాలా ఎక్కువగా భక్తి భావాలు కలిగి ఉంటారని తెలిపారు. వీరందరూ ప్రభావంతో తాను కూడా మతపరమైన ప్రభావంలో చిక్కుకున్నానని.. ఇలా కొన్నాళ్లపాటు సన్యాసిగా గడపానని చెప్పారు. అలాగే ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని సైతం అనుసరించి బైబిల్ చదవడం చర్చికి వెళ్ళటం చేశానని అయితే ఇవన్నీ చేశాక మతం అనేది ఒక దోపిడీ అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అని తెలిపారు.. అయితే రాజమౌళి మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..

రాజమౌళి నాస్తికుడే అయినప్పటికీ తన సినిమాల వరకు మాత్రం ఈ విషయాన్ని తీసుకురారు. తన చిత్రాలపై హిందూ ఇతిహాసాలైనా రామాయణం, మహాభారతం ఎంతో ప్రభావితం చేశాయని ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. అలాగే తను తీసే సినిమాల వెనక ఏదో ఒక గ్రంథం ప్రభావం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. అయితే ఈ గ్రంథాలన్నీ మహాసముద్రాలు వంటివని చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుందని చెప్పుకొస్తూనే ఉంటారు. గ్రంధాల్లో ఉన్న మతపరమైన అంశాలకి తాను దూరమైనప్పటికీ అందులో ఉన్న సృజనాత్మకత గొప్పతనం తనని ఎప్పటి ఆకట్టుకునే ఉంటాయని చెప్పుకొస్తుంటారు రాజమౌళి.

Read more RELATED
Recommended to you

Exit mobile version