భీష్మ, వాళ్లకు మంచి త్రుప్తిని ఇచ్చింది…!

-

ఈ ఏడాది ఏమంటూ దర్శకులు సినిమాలు విడుదల చేసారో గాని కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే హిట్ రేటింగ్ ఉందీ అనేది వాస్తవం. టాలీవుడ్ లో ప్రేక్షకులకు సినిమా మీద ఎన్నో ఆశలు ఉంటాయి. సినిమాకు వెళ్తే వినోదం ఉండాలి. సినిమాకు పెట్టిన ఖర్చు విషయంలో ఒక సంతృప్తి ఉండాలి. ఎందుకంటే మన వాళ్లకు ఎక్కువగా సినిమా మీదే వినోదం ఆధారపడి ఉంటుంది. ఇంట్లో సినిమా చూసినా సరే అది బెస్ట్ గా ఉంటేనే చూస్తారు.

లేకపోతే టీవీ ఆఫ్ చేయడమే. అలాంటి వారికి సంక్రాంతి తర్వాత గత నెల రోజుల నుంచి ఒక్క మంచి సినిమా కూడా దొరకలేదు. ఆరు సినిమాలో ఏడు సినిమాలో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. కాని ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. దీనితో నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమా విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అయినా హిట్ అవుతుందా లేదా అని ఎదురు చూసారు.

పాపం నెల రోజుల తర్వాత ప్రేక్షకుల కోరిక తీరింది అనే చెప్పాలి. జానూ, డిస్కో రాజా, వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా వచ్చిపోయాయి గాని ఏమీ ఆకట్టుకోలేదు. అసలు ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపురములో ఒక్కటే మంచి సినిమా. దీనితో ఇప్పుడు ప్రేక్షకులకు భీష్మ సినిమా వినోదం కరువు తీర్చారు. ఒకరకంగా ఈ సినిమా టాలీవుడ్ కి ఎనర్జీ ఇచ్చింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news