వైరల్ వీడియో; హాలీవుడ్ టాప్ సాంగ్ ని పొల్లు పోకుండా పాడిన బెగ్గర్…!

-

పాట్నాకు చెందిన ఒక బెగ్గర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. రెండు నిమిషాల ఇరవై సెకన్లు ఉన్న వీడియోను వందన జయరాజన్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేసారు. అసలు ఆ వీడియో లో ఏమి ఉంది అనేది చూస్తే… హాలీవుడ్ సింగర్ జిమ్ రీవ్స్ పాడిన పాట హిల్ హావ్ టు గోను ఆ బెగ్గర్ పాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తి బెగ్గర్ తో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఈ వీడియో బయటకు వస్తుంది.

బెగ్గర్ తో మంచి సంభాషణలో ఉండగా… “కాబట్టి మీరు మీ రోజువారీ జీవితానికి ఏమి చేస్తారు?” అని ప్రశ్నించగా… నేను బెగ్గర్ ని, అడుక్కుని జీవితాను అని చెప్పాడు. అతని ఆహారం గురించి అడిగగా… దీనిపై అతను ఏమీ సమాధానం ఇవ్వలేదు. “సర్వశక్తిమంతుడు నాకు ఏది ఇచ్చినా, నేను దానితో సంతోషంగా ఉన్నాను” అని బెగ్గర్ చెప్తాడు. “నేను గాయకుడిని, డాన్సర్ ని చెప్తాడు. నా పేరు సన్నీ బాబా” అని వివరించారు.

ఈ సమయంలోనే అమెరికన్ గాయకుడు జిమ్ రీవ్స్ 1959 లో పాడిన పాట హి విల్ హావ్ టు గో అంటూ తన స్వరంతో అలరించాడు. విల్ హావ్ టు గో, అనే పాట అప్పట్లో బాగా క్లిక్ అయింది. పాప్ సింగర్స్ అందరూ అమెరికాలో ఈ పాటను పాడారు కూడా. అతని వాయిస్ కి ట్విట్టర్ ఫిదా అయిపోయింది. ఇక దీనిని యుట్యూబ్ లో కూడా పోస్ట్ చేసి… అతనికి సింగింగ్ ఛాన్స్ ఇవ్వాలి అంటూ పలువురు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news